Tuesday, October 8, 2024

నంద్యాల జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన

నంద్యాల : నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొలిమిగుండ్ల మండలం, కల్వటాల గ్రామం సమీపంలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి కల్వటాల హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. అనంతరం కల్వటాల హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సామూన్, రామ్ కో సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.ఆర్ వెంకట్రామ రాజా, జిల్లా ఇన్ చార్జి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్‌ బాషా, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్, రాష్ట్ర భూగర్భ గనుల, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పి.పి.నాగిరెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, రామ్ కో సిమెంట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ కె.శోభన్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం ప‌లికారు. అనంతరం కల్వటాల హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన వెళ్లి రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జ‌గ‌న్‌ ప్రారంభించారు.

మొదట రామ్ కో సిమెంట్ పరిశ్రమలో స్విచ్ ఆన్ చేసి పరిశ్రమను ప్రారంభించారు. అంతకుముందు రామ్ కో సిమెంట్ పరిశ్రమలో ఫోటో గ్యాలరీ, గ్రీన్ రూమ్ ను పరిశీలించారు. కల్వటాల గ్రామ సమీపంలో దాదాపు 450 ఎకరాల్లో రూ.1950 కోట్లతో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పింది. సిమెంట్ పరిశ్రమ నుంచి ప్రతి ఏటా 3.50 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుంది.. దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రామ్ కో వ్యవస్థాపకులు రామ సుబ్రమణ్యస్వామి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం అక్కడి నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.58 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి బయలుదేరగా ఆయనకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ , కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డిఐజి సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు సాదర వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement