Saturday, April 27, 2024

రెస్టారెంట్ లో భారీ అగ్నిప్ర‌మాదం-17మంది మృతి

ఓ రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది.ఈ ప్ర‌మాదంలో 17మంది మృతి చెందారు. కాగా ఈ ప్ర‌మాదంలో మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చైనాలోని జిలిన్ ప్రావిన్సులో చాంగ్‌చున్ సిటీ ఉంది. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌స్తుతం మంట‌ల్ని ఆర్పేశారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలే తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement