Thursday, May 2, 2024

ఆర్యవైశ్యులంతా యూనిటీగా ఉండాలి : టీజీ భరత్

కర్నూలు : ఆర్యవైశ్యులందరూ యూనిటీగా కలిసి ముందుకు సాగాలని కర్నూలు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి టీజీ భరత్ అన్నారు. ఆదివారం నగరంలోని మౌర్య ఇన్ లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ దక్షిణ ఏపీ కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తో పాటు టీజీ భరత్ పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్య ఆర్గనైజేషన్ ని ఒకే తాటిపైకి వచ్చి యూనిటీగా ఉండాలని చెప్పారు. అప్పుడే ప్రభుత్వాలు కూడా ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తాయన్నారు. ఇక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి తరుపున కూడా కృషి చేశామన్నారు. కొత్త కార్యవర్గం బాగా పని చేయాలని, ఎన్ఆర్ఐవీఏతో కలిసి పని చేసేందుకు ప్లాన్ చేయాలన్నారు. ఇక ఇటీవల కర్నూల్ లో నిర్వహించిన కార్తీక వనభోజనం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో అన్ని ఆర్గనైజేషన్ ను కలిసి పాల్గొని విజయవంతం చేశాయని తెలిపారు. అందుకే ఆర్యవైశ్య ఆర్గనైజేషన్లన్నీ ఒకే గొడుగు కిందకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ప్రెసిడెంట్ రామక్రిష్ణ, నేషనల్ కో ఆర్డినేటర్ ఇల్లూరు లక్ష్మయ్య, దక్షిణ విభాగం ప్రెసిడెంట్ సుబ్బరాజ, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement