Sunday, May 19, 2024

Himachal pradesh : సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సుఖ్వీందర్ సింగ్.. సంతోషంగా ఉందన్న ప్రియాంకగాంధీ

హిమాచల్ ప్రదేశ్ 15వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు సుఖ్వీందర్ సింగ్ సుఖు.ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం చాలా సంతోషంగా ఉన్నాం అని అన్నారు. తాము వాగ్దానం చేసినవాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. షిమ్లాలోని చారిత్రక రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement