Friday, May 17, 2024

ప్రభుత్వరంగ సంస్థ‌ల‌ను కాపాడుకుంటాం …..జ‌న‌ర‌ల్ బీమా ఉద్యోగులు..

క‌ర్నూలు – సాధార‌ణ బీమా కంపెనీల ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు చేప‌ట్టిన స‌మ్మె విజ‌య‌వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా కర్నూలు న్యూ ఇండియా అష్యూరెన్సు కంపెనీ వద్ద జరిగిన కార్య‌క్ర‌మానికి రాష్ట్ర సహాయకార్యదర్శి రఘుబాబు అధ్యక్షత వహిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలు వినాశనకరంగా ఉన్నాయని, ప్రజలకు సేవ చెస్తున్న సాధారణ బీమా సంస్థలను కార్పోరేటు, విదేశీ సంస్థలకు అప్పజెప్పి తమ భక్తిని చాటుకుంటున్నాయన్నారు. జాతీయత పేరు ఒక పక్క చెబుతూనే జాతీయం చేసిన రంగాలను తిరిగి ప్రయివేటు వారికియ్యడం ఎటువంటి దేశభక్తి అని ప్రశ్నించారు. 43 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టాలని, ప్రయివేటీకరణ ప్రక్రియలను ఆపాలని, పాత పెన్షన్ విధానాన్ని అందరికీ అమలు చేయాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి బిల్లును వాపసు తీసుకోవాలన్నారు. ఫెడరేషన్ నాయకులు వి.భాస్కర్ మాట్లాడుతూ తమ కంపెనీలకోసం ఎంతవరకైనా పోరాడతామని, వాటికి ఎటువంటి హాని తలపెట్టినా సహించమన్నారు. బీమా కంపెనీల డివిజనల్ మేనేజర్లు ఎం.దుర్గెశ్వరరావు, జె.భానుమూర్తి, ఎ.రామకృష్ణ, ఎ.ఓబులపతి మాట్లాడుతూ తమ ఆస్తుల విలువను తక్కువగా చూపి, తమ కంపెనీల క్లెయిములను ఎక్కువ చేసి చూపి ప్రభుత్వ కంపెనీలనను నష్టాల్లో చూపుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. రాధాకృష్ణ మాట్లాడుతూ బీమా కంపెనీలతో పాటు రైతు సమస్యలపై, విశాఖ ఉక్కుపై, ఇతర ఉద్యమాలలో త‌మ కార్మిక సంఘం అండగా నిలుస్తుందన్నారు. బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి .నాగరాజు మాట్లాడుతూ తమ రెండురోజుల సమ్మె జరిగిన మరుసటిరోజే సాధారణ బీమాలో సమ్మె విజయవంతం చేశారని, తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. గ్రామీణ బ్యాంకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని సేవారంగాలనుండి తప్పుకొని ప్రయివేటు కార్పోరేట్లకు ఒక కాపలాదారుగా మారిపోతోందనీ బీమా సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వినిల్ కుమార్ , శివనారాయణ, రంగనాధరెడ్డి, శ్రీమతి.జయశ్రీ, సృజనా సారిక, రీనా సింథియా, శ్రీనివాసరెడ్డి, అజీజ్ అహ్మద్ , గోపి, కృష్ణ, మైకెల్ , ఎస్ .ఎం.బాష మొదలైన వారు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement