Saturday, June 1, 2024

TS : ఆస్తీ కోసం త‌ల్లి అంత్య‌క్రియ‌లు ఆపారు

తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎక్కడ తమకు దక్కకుండా పోతుందనే ఆవేదనతో మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచుకుని పిల్లలు పంచాయితీకి ఎక్కిన వింత ఘటన సూర్యపేటలో చోటుచేసుకుంది.
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెం లక్ష్మమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఓ కుమారుడు చాలా కాలం క్రితమే మృతి చెందగా.. కూతుళ్ళ వద్దే ఉంటుంది లక్ష్మమ్మ.

- Advertisement -

వీరి కోసం బాగానే ఆస్తులు సంపాదించింది. అయితే ఈ ఆస్తులే ఆమె అంత్యక్రియలకు అడ్డుగా మారాయి. కొద్దిరోజుల క్రితం తన కూతురు ఇంటికి వెళ్లిన లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు జారీ పడింది. దీంతో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితమే మృతి చెందింది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందడంతో కొడుకు, కూతుళ్లు ఆస్తి పంపకాలు పూర్తయ్య వరకు అంబులెన్స్ ను తరలించేది లేదని తేల్చిచెప్పారు దీంతో లక్ష్మమ్మ వద్ద ఉన్న 21 లక్షల రూపాయల్లో ఆరు లక్షలు వైద్య ఖర్చులకు ఖర్చు చేయగా మిగిలిన 15 లక్షల రూపాయలను కొడుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలి వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. పంపకాలు సమానంగా.. సమస్య లేకుండా ముగిసినా.. అంత్యక్రియలు చేయాల్సిన కొడుకు చివరి క్షణంలో కొర్రీ పెట్టడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.

అంత్యక్రియలకు అయ్యే ఖర్చును సమానంగా భరించాలని… అలా జరిగితేనే తలకొరివి పెడతామని తేల్చి చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. దీంతో అంతక్రియల ఖర్చు వివాదం తల్లి అంత్యక్రియలు నిలిచిపోయేలా చేసింది. అంత్యక్రియల ఖర్చు పంచాయతీ కొడుకు, కుమార్తెల మధ్య గొడవకు కారణమైంది.. దీంతో అంత్యక్రియలు ఆగిపోగా ఫ్రీజర్ లోనే లక్ష్మమ్మ మృతదేహం ఉండిపోయింది. కన్న బిడ్డల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెడ్ బాడీని ఇంకా అంత్యక్రియలు జరపకుండా ఇంటి వద్ద ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మమ్మ బతికున్నప్పుడు బాగానే ఉందని ఎవరితోనూ మాట పడేది కాదని, కానీ ఇప్పుడు ఆమె అంత్యక్రియలు కూతుర్లు, కొడుకు వల్లే ఆగిపోవడం బాధగా వుందని తెలిపారు. పెద్దవారు ఎవరైనా వచ్చి లక్ష్మమ్మ అంత్యక్రియలు జరిపించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement