Tuesday, May 14, 2024

పోలీస్ లెక్చరర్ గా మారబోతున్న వేళ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా లను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా ఉన్నాడు. ఇక మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో కూడా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చేస్తున్నాడు. వీటితో పాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

కెరీర్ లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గబ్బర్ సింగ్ లో పోలీస్ గా కనిపించిన పవన్ ఈ చిత్రంలో లెక్చరర్ గా కనిపించబోతున్నాడట. పవన్ ను సరి కొత్తగా చూపించేందుకు హరిశంకర్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు పవన్ ఏ సినిమాలో కూడా లెక్చరర్ గా కనిపించలేదు. మరి హరీష్ డైరెక్షన్ లో పోలీస్ గా మెప్పించిన పవన్ ఇప్పుడు లెక్చరర్ గా ఏ మేర మెప్పిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement