Sunday, April 28, 2024

కోవిడ్ వ్యాక్సినేషన్ అంద‌రూ వేయించుకోవాలి.. విప్ ఉదయభాను.

జగ్గయ్యపేట రూరల్ – 45 ఏళ్ల వయసు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతిఒక్కరు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలియజేశారు. మండలంలోని చిల్లకల్లు గ్రామ సచివాలయంలో బూచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ట్రైల్ రన్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ తో కలిసి ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్నవారికి సత్వరమే కరోనా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని వైద్యాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారని తెలిపారు. కరోనా టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవడం జరిగిందని, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రజలు వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా అనారోగ్యానికి గురవుతున్నది, కేవలం అపోహలు మాత్రమేనని ప్రజలు వాటిని నమ్మవద్దని అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 18 వరకు 13,80,537 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. తాను కరోనా వ్యాక్సినేషన్ టీకా తీసుకున్నానని, ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు పైబడి టీకా వేయించుకున్న వృద్ధ మహిళలను ఆరోగ్య శాఖ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పి. డి. శ్రీనివాస్ వైద్యాధికారులు అనిల్ కుమార్ , వైద్య ఆరోగ్య సిబ్బంది , పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement