Monday, April 29, 2024

నీతులు చెప్పడం కాదు…పాటించాలి – బూమ్రా పై నెటిజన్స్ ఫైర్

మనం పాటించనప్పుడు పక్కోడికి నీతులు చెప్పకూడదు… అంటున్నారు నెటిజన్లు. అవును ఇతరులకి మనం చెయ్యొద్దు అన్న పనిని మనం చేస్తే ఎలా ఉంటుంది ? ఇప్పుడు అలానే ఉంది క్రికెటర్ బూమ్ర పరిస్థితి. మార్చి 14వ తేదీన ఫాస్ట్ బౌలర్ బూమ్రా పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఓ ఫోటో అయితే చర్చనీయాంశంగా మారింది.

ఫోటో చర్చనీయాంశంగా మారడం ఏంటి అనుకుంటున్నారా? 2017 లో దివాలి సందర్భంగా బూమ్రా ఓ ట్వీట్ చేశాడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సే నో టు ట్రాకర్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. కానీ ఈ ఫోటోలలో తన చుట్టూ ఉన్న వాళ్ళు క్రాకర్స్ కాలుస్తుంటే.. ఆ మధ్యలో బూమ్రా దంపతులు నడుచుకుంటూ వస్తున్నారు. ఇక అది చూసిన నెటిజన్లు 2017 లో చేసిన ట్వీట్ ను వెనక్కి లాగి… అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నావ్ ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement