Sunday, May 12, 2024

రూ.57. 29 కోట్ల విలువైన‌ రోడ్డు విస్తరణ పనుల‌కు కొడాలి నాని భూమి పూజ‌…

పామ‌ర్రు – రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేశారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు . కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం నిడుమోలు నుండి గుడ్లవల్లేరు మండలం కవుతరం మీదుగా ఐలూరు వరకు 29 కిలోమీటర్ల మేర రూ . 57.29 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి మంత్రి కొడాలి నాని బుధవారం శంఖుస్థాపన , భూమిపూజ కార్యక్రమాలను నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు . ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎడీపీ నిధులతో ఆల్దాండ్ బీ శాఖ నాలుగు విడతల్లో రూ . 8 వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లను నిర్మిస్తోందన్నారు . వీటితో పాటు తుఫాన్లు , వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు రూ .2,500 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామన్నారు . టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కన్పించడం లేదన్నారు . ఒక్కో మండలానికి రూ . 15 కోట్ల నుండి రూ .20 కోట్ల వరకు అంతర్గత రోడ్లు , డ్రైన్ల నిర్మాణానికి ఎత్తేజ్ఎస్ నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు . ఈ నిధులతో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు . వీటితో పాటు వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారన్నారు . నాడు – నేడు పేరుతో రాష్ట్రంలో 45 వేల పాఠశాలల ఆధునికీకరణ పనులను చేపట్టారన్నారు . మొదటి విడతగా రూ . 10 వేల కోట్ల నిధులను విడుదల చేస్తున్నారని చెప్పారు . ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి వసతులను కల్పించడం జరిగిందన్నారు . సీఎం జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ప్రతి నిమిషం ఆలోచన చేస్తున్నారన్నారు . రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారన్నారు . జగన్ చేస్తున్న కార్యక్రమాలను మనం చెప్పుకోనవసరం లేకుండా ప్రతిపక్షాలే చెబుతున్నాయన్నారు . రూ . 90 వేల కోట్ల రాష్ట్ర సంపదను ప్రజలకు పంచారని టీడీపీ , జనసేన పార్టీల నాయకులే అంటున్నారని , దీన్నిబట్టి పేదల కోసం సీఎం జగన్ ఎంతగా ఆలోచన చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు . జగన్ ను ద్వేషించే శత్రువులు కూడా ఆయన పాలనకు నూటికి 150 మార్కులు వేస్తున్నారన్నారు . అయితే అభివృద్ధి చేయడం లేదని మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు . పేదలకు ఖరీదైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూశామన్నారు . కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వసతులను సీఎం జగన్ కల్పించారని , విలేజ్ క్లినిక్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు . మచిలీపట్నంలో రూ .550 కోట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు . సీఎం జగన్మోహనరెడ్డి పాలనను ప్రజలు ఆదరించడం వల్లే గత పంచాయతీ , మున్సిపల్ , కార్పోరేషన్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందించారన్నారు . వచ్చే తిరుపతి పార్లమెంట్ , జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఫలితాలు ఇదే విధంగా వస్తాయని మంత్రి కొడాలి నాని తెలిపారు . ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement