Monday, May 6, 2024

మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన ముద్దాయిలు అరెస్ట్-రిమాండ్

పమిడిముక్కల, జులై 24 : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ముద్దాయిలను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు పమిడిముక్కల ఎస్ఐ తెలిపారు. ఈనెల 15వ తారీఖున మైనర్ బాలిక కనిపించడం లేదని తల్లితండ్రులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు పమిడిముక్కల ఎస్ఐ కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా మేడూరు గ్రామానికి చెందిన ప్రస్తుతం విజయవాడలో నివశిస్తున్న కొడాలి నాగబాబు అనే వ్యక్తి చాలాకాలం నుండి ప్రేమ పేరుతో వెంటపడుతూ మాయమాటలతో ఆమెని ప్రేమ పేరుతో లోబరుచుకుని, కావలి దగ్గరలోని రామవరప్పాడు గ్రామానికి సదరు మైనర్ బాలికను తీసుకెళ్లి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడినట్లు, సదరు మైనర్ బాలిక ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం సదరు కొడాలి నాగబాబు, అతనికి సహకరించిన గుండాల సంపత్ కుమార్ పై 363, 343, 376(1) 212 ఆర్ /డబ్ల్యూ 34 ఐపిసీ, 4 అండ్ 16 పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి పమిడిముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ముద్దాయిలని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించినట్లు పమిడిముక్కల ఎస్ఐ కె.ఎన్.వి.సత్యన్నారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement