Friday, February 3, 2023

సీబీఐ విచారణకు హాజరౌతా : ఎంపి అవినాష్

సీబీఐ నిన్న నోటీసు ఇచ్చారని, మళ్లీ కూడా ఇస్తారని కడప ఎంపి అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం నోటీస్ ఇచ్చి ఇవాళ విచారణకు రమ్మన్నారని, ముందే ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ కారణంగా ఇవాళ అటెండ్ కాలేనని చెప్పానన్నారు. ఐదు రోజుల సమయం కావాలని కోరానన్నారు. తరువాత మళ్ళీ నోటీస్ ఇస్తారని, తప్పకుండా విచారణకు హాజరై సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాని తెలిపారు.

- Advertisement -
   


నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నా :
వివేకా హత్యకేసులో సీబీఐ నోటీసులపై కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి స్పందిస్తూ.. గత రెండున్నర సంవత్సరాలుగా నాపై , నా కుటుంబం పై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందన్నారు. త‌నపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నాని పేర్కొన్నారు. తానేమిటో త‌న వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలంద‌రికీ బాగా తెలుసన్నారు.
న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలన్నదే త‌న ధ్యేయమని మాట్లాడారు. మీడియా ముఖంగా కోరుకుంటున్న నిజం తేలాలని తాను కూడా భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. ఆరోపణ చేసే వారు మరొకసారి ఆలోచించాలి.. ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండని మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement