Friday, December 6, 2024

క‌త్తితో కేక్ క‌టింగ్.. మ‌రోసారి వార్త‌ల్లోకెక్కిన డేరా బాబా

డేరాబాబా మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కాడు. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఉన్న సునారియా జైల్లో ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. రేప్, మర్డర్ కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా బాబా ఒక కార్యక్రమం కోసం ఆయన 40 రోజుల పెరోల్ పై జైలు నుంచి గత శనివారం బయటకు వచ్చాడు. జైలు నుంచి ఆయన నేరుగా ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ లో ఉన్న బర్నవా ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన వేడుకలో ఒక భారీ కేకును పెద్ద కత్తితో కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేక్ కట్ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వీడియోలో వినిపిస్తున్నాయి. ‘ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఐదేళ్ల తర్వాత అవకాశం వచ్చింది. నేను కనీసం ఐదు కేకులను కట్ చేయాలి. ఇది తొలి కేక్’ అని డేరా బాబా అన్నారు. ఆయుధాల చట్టం ప్రకారం బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడం నిషేధం అనే విషయం గమనార్హం. గత 14 నెలల సమయంలో డేరా బాబా జైలు నుంచి పెరోల్ పై బయటకు రావడం ఇది నాలుగోసారి. గత మూడు నెలల్లో బయటకు రావడం ఇది రెండోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement