Sunday, May 12, 2024

రాష్ట్ర వ్యాప్తంగా 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు చేస్తున్న అదికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: యోగా భారతీయ వారసత్వ సంపదలో భాగమని, ప్రపంచమంతా యోగా వైపు చూస్తున్న తరుుణలో మనము యోగాని అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు సూచించారు. ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోవు 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవవేడుకల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం, యోగా వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియ చెప్పటం కోసం ఆంధ్రప్రదేశ్‌ ఆయుష్‌ విభాగము ఆదివారం ఉదయం 6గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ, ఈనెల 21న ప్రధాన కార్యక్రమం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతుందని, రాష్ట్రంలోని 75 ఇతర ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్తిల్‌ దినకర్‌ , ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూఫుర్‌ జెండా వూపి ర్యాలీ ని ప్రారంభించారు. స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ డీవీమానర్‌, సిద్దార్థ కళాశాల,జమ్మిచెట్టు- సెంటర్‌, శిఖామణి సెంటర్‌ మీదుగా తిరిగి స్టేడియం వద్దకు చేరింది. ఈ ర్యాలీ లో ఆయుర్వేద కళాశాల, బుద్ధ యోగ ఫౌండేషన్‌, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రతినిధులతో పాటు- ఆయుష్‌ శాఖ ఉద్యోగులు 500 మందికి పైగా పాల్గొన్నారు. తదనంతరం నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పలువురితో కల్సి యోగాసనాలు వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement