Sunday, April 28, 2024

Spl Story: శృంగారం త‌ర్వాత నిద్ర ఎందుకు వ‌స్తుంది? న్యూయార్స్ వ‌ర్సిటీ అధ్య‌య‌నం ఏం చెబుతుందంటే..

శృంగారంలో పాల్గొన్న తర్వాత కొంత‌మంది గాఢ నిద్ర పోతుంటారు. అయితే, అది అలసట వల్ల వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ, దీని వెనుక వేరే విష‌యం దాగిఉంద‌ని డాక్ట‌ర్లు అంటున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో సైన్స్, హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్‌ ప్రాజెక్ట్ ‘సైన్స్‌లైన్‌’కి చెందిన మెలిండా వెన్నర్ దీనిపై పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అవేంటో చ‌దివి తెలుసుకోండి..

చాలామంది మ‌గాళ్లు శృంగారంలో పాల్గొన్న త‌ర్వాత వెంట‌నే నిద్రపోతారు. ఈ పరిస్థితి ఆడాళ్ల‌లో అయితే తక్కువగా ఉంటుంది. మ‌గాళ్లు శృంగార ఉద్వేగంతో స్కలించగానే కనురెప్పలు వాలిపోయి, ఫుల్ బాటిల్ కొట్టినంత‌గా మ‌త్తులో జోగుతుంటారు. దీంతో ఆడాళ్లు కూడా ఇంతేనా అని కొంత‌మందికి సందేహం వ‌స్తుంటుంది. దీనిపై చాలా కంప్లెయింట్స్ కూడా ఉన్నాయంటున్నారు డాక్ట‌ర్లు. అయితే, దీనికి సంబంధించి మ‌గాళ్ల‌లో త‌ప్పేమీ లేద‌ని, వారి బాడీలో జరిగే ర‌సాయ‌న ప్రక్రియ‌లే కారణమని దీనిపై అధ్య‌య‌నాలు చేసిన న్యూయార్స్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన మెలిండా తెలిపారు. శృంగారంలో పాల్గొన్న‌ తర్వాత ఆడాళ్లు కూడా నిద్ర‌పోతార‌ని వెల్ల‌డించారు. అయితే.. మ‌గాళ్ల‌తో కంపేర్ చేస్తే ఆడాళ్లు నిద్ర‌పోయే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని వారి అధ్య‌య‌నంలో వెల్ల‌డ‌య్యింది.

ఇక‌.. శృంగారమనేది ఎక్కువగా రాత్రి వేళల్లోనే బెడ్‌పై జ‌రిగే ఓ అద్భుత ప్ర‌క్రియ‌. శృంగారంలో పురుషుల శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సాధార‌ణంగానే వారు అలసిపోతారు. దీంతో ఆ ప‌ని ముగిసిన వెంటనే నిద్రపోవడం స‌హ‌జమే అంటున్నారు డాక్ట‌ర్లు. అయితే.. చాలామంది ఇట్లా అల‌సిపోవ‌డం వ‌ల్ల‌నే నిద్ర‌పోతాం అనుకుంటార‌ని, దానికి అస‌లు కార‌ణం వేరే ఉంద‌ని చెబుత‌న్నారు. శాస్త్రీయంగా దీనికి అలసటతోపాటు మరో కారణం కూడా ఉందట.

శృంగారం సమయంలో స్త్రీ, పురుషుల్లో వేరే ఆలోచన ఉండదు కాబట్టి అన్నీ మరిచిపోయి కళ్లు మూసుకోగానే నిద్రవచ్చేస్తుంది. అదే సమయంలో మ‌గాళ్ల‌లో శృంగారం వల్ల కలిగే ఉద్వేగం, స్కలనం వల్ల నోర్‌పైన్‌ఫ్రైన్ (norepinephrine), సెరోటోనిన్ (serotonin), ఆక్సిటోసిన్ (oxytocin), వాసోప్రెసిన్ (vasopressin), నైట్రిక్ ఆక్సైడ్ (NO), ప్రోలాక్టిన్(prolactin) అనే హార్మోన్‌‌లు విడుదల అవుతాయి. ఇక‌.. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదల లైంగిక సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రోలాక్టిన్ లోపం ఉండే మ‌గాళ్ల‌లో నిద్ర అంతగా రాదు. కాబట్టి, స్కలనం తర్వాత మళ్లీ మళ్లీ శృంగారంలో పాల్గొనే చాన్సెస్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని ప‌లు అధ్యయనాలు చెబుతున్నాయి.

శృంగార సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే రెండు ఇతర రసాయనాలు కూడా నిద్రతో సంబంధం కలిగి ఉంటాయంటున్నారు డాక్ట‌ర్లు. ఆక్సిటోసిన్ ఒత్తిడి స్థాయిలను తగ్గించి విశ్రాంతి లేదా నిద్రకు ఉపక్రమించేందుకు ప్రోత్సహిస్తుంది. శృంగారం తర్వాత నిద్ర అనేది సహజసిద్ధమైనేదనని, అది మంచి అలవాటేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దీన్ని లోపంగా భావించవద్దని అంటున్నారు. శృంగారం వల్ల అలసిన శరీరం తిరిగి శక్తిని పుంజుకోడం కోసం నిద్రకు ప్రేరేపిస్తుందంటున్నారు. అందుకే, కొందరు రాత్రి బాగా నిద్రపోయి.. తెల్లవారుజామున కూడా ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటారు. ఇటీవల యూకేలో 10 వేల మంది పురుషులపై జరిపిన సర్వేలో 48శాతం మంది శృంగారం తర్వాత నిద్రపోతామని వెల్ల‌డ‌య్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement