Friday, February 3, 2023

Follow up | ఇన్‌స్ట్రాగ్రాం పరిచయమే ఒక మోసం.. నిజం తెలిశాక దూరం పెట్టిన తపస్వీ

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రేమోన్మాది చేతిలో బలైపోయిన వైద్య విద్యార్ధినీ తపస్వి కేసు దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇన్‌స్ట్రాగ్రాం పరిచయమే ఆమెను మోసం చేసింది. ముక్కు ముఖం తెలియని ఎవడో ఒకడు సోషల్‌ మీడియాలో విసిరిన కపట ప్రేమ వలలో పడిన యువతి కధ చివరికి తీవ్ర విషాదంతో ముగిసింది. ఇన్‌స్ట్రాగ్రాంలో పరిచయమైన నిందితుడు ఙ్ఞానేశ్వర్‌ ప్రత్యక్షంగా కలిశాక కొద్దిరోజులకు వాస్తవాలు, అతని నిజస్వరూపం ఆమెకు తెలిసిపోయింది. దీంతో అతనిలోని రాక్షసత్వం తపస్వీని బలితీసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్న క్రమంలో వెల్లడైన విషయాలు విస్తుగొల్పుతున్నాయి.

అదేవిధంగా తపస్వీ స్నేహితురాలిని కూడా ప్రశ్నించిన అధికారులు సంఘటన జరిగిన విధానం, అంతకుముందు జరిగిన ఉదంతానికి సంబంధించి మరిని ్న అంశాలు సేకరించారు. నిందితుడు జ్ఞానేశ్వర్‌ అసలు సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాదని, పెయింటింగ్‌ పనులకు వెళ్లే కూలీ అని పోలీసులు ధృవీకరించారు. కులం విషయంలో కూడా మభ్యపెట్టి మోసం చేశాడని, అది బయటపడేసరికి ఆమె దూరం పెట్టడంతో ఇలా ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. కృష్ణా జిల్లా మానికొండకు చెందిన మన్నే జ్ఞానేశ్వర్‌ అలియాస్‌ డింపు సుమారు రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తపస్వితో పరిచయం చేసుకున్నాడు. ఆమె పెట్టే ప్రతీ పోస్ట్‌కి లైకులు కొడుతూ మరింత దగ్గరయ్యాడు.

- Advertisement -
   

తన ఇంటి పేరును చూపి అగ్రకులానికి చెందిన వ్యక్తిగా తప్పుదారి పట్టించాడు. అతని మాయలో పడిన తపస్వీ , ఙ్ఞానేశ్వర్‌ఒ మూడు నెలల క్రితం ఒకరినొకరు కలుసుకున్నారు. జ్ఞానేశ్వర్‌ పుట్టిన రోజుకి తపస్వీ గోల్డ్‌, బహుమతులు ఇచ్చింది. ఈక్రమంలో కొద్దిరోజుల క్రితం తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తాను సాఫ్ట్‌వేర్‌ని కాదని, తన సామాజిక వర్గం కూడా వేరేనని చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన యువతి తాను మోసపోయానంటూ మనస్తాపం చెంది జ్ఞానేశ్వర్‌ను ద్వేషించింది. తర్వాత నుంచి అతన్ని దూరం పెడుతూ వచ్చింది. దీంతో శాడిస్టుగా మారిన ఙ్ఞానేశ్వర్‌ నిత్యం ఆమెను వేధించసాగాడు. దీనిలో భాగంగానే తనను ప్రేమించాలని, పెళ్ళి చేసుకోవాలని లేకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు.

దీంతో తపస్వీ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు జ్ఞానేశ్వర్‌ను, అతని తండ్రిని పిలిచి హెచ్చరించారు. ఆమె ఇచ్చిన బంగారం, బహుమతులు తిరిగి ఇప్పించేశారు. ఈక్రమంలోనే ఆమె కొద్దిరోజుల క్రితం గన్నవరంలో ఉంటున్న రూమ్‌ను ఖాళీ చేసి గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు స్నేహితురాలి వద్దకు వెళ్ళింది. ఇక ఆమెను ట్రాక్‌ చేసే పనిలో పడిన ఙ్ఞానేశ్వర్‌ చివరికి స్నేహితురాలి ఇంటికి వెళ్ళి తపస్వీతో గొడవపడి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. జ్ఞానేశ్వర్‌కు గంజాయి, మద్యం అలవాటు ఉందని, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో నకిలీ పేరులతో ఐడీలు క్రియేట్‌ చేస్తూ సెల్‌ఫోన్‌లు మారుస్తుంటాడని చెబుతున్నారు.

తపస్వీ స్నేహితురాలిని విచారణ..

మెడికో తపస్వీ హత్యలో ప్రత్యక్షంగా ఉన్న ఆమె స్నేహితురాలిని పోలీసులు విచారించారు. నిందితుడు ఙ్ఞానేశ్వర్‌ అదుపులో ఉన్నప్పటికీ మొదటి నుంచి ఏం జరిగిందనే కోణంలో మరింత సమాచారం రాబట్టేందుకు స్నేహితురాలిని ప్రశ్నించారు. పరీక్షల సమయం కావడంతో తపస్వి తక్కెళ్లపాడులోని స్నేహితురాలి దగ్గరికి వచ్చి ఉంటోంది. ఆమెను ట్రాక్‌ చేసిన జ్ఞానేశ్వర్‌ స్నేహితురాలి సమక్షంలో చర్చలు జరిపేందుకు అక్కడికి వచ్చాడు. తనను పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా విసుగు చెందిన తపస్వీ తోసిపుచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగడంతో ముందుగానే తనతో తెచ్చుకున్న సర్జికల్‌ బ్లేడుతో తపస్విపై దాడి చేశాడు.

ఉూహించని ఘటనతో స్నేహితురాలు షాక్‌కు గురైంది. తపస్వీ కింద పడిపోగా కేకలు పెడుతూ స్నేహితురాలు బయటకు వచ్చి చుట్టు పక్కల వారిని పిలుచుకుని వచ్చేసరికి నిందితుడు తలుపులు మూసేసి తపస్వీపై విచక్షణ రహితంగా గాయపరిచాడు. స్ధానికులు వచ్చి తలుపు తీసి తపస్వీని ఆస్ప్రతికి తరలించగా అప్పటికే మృతి చెందింది. అయితే నిందితుడు ఙ్ఞానేశ ్వర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా బెదిరించే ప్రయత్నంలో భాగంగా చేయి కోసుకున్నాడు. అయినా అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోస్టు మార్ట ం పూర్తి..

కాగా హత్యకు గురైన మెడికో విద్యార్ధిని తపస్వీ మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం పూర్తయింది. ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను వైద్యులు పోలీసు అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. తపస్వీపై నిందితుడు అత్యంత పైశాచికంగా గాయపరిచినట్లు వెల్లడైంది. గొంతు వద్ద కోసిన రెండు గాయాలు, వెనుక వైపు మరో రెండు గాయాలు, భుజంపై ఒక గాయం తపస్వీ శరీరంలో మొత్తం ఐదు చోట్ల తీవ్ర గాయాలున్నట్లు వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా కృష్ణా జిల్లా స్వగ్రామానికి తపస్వీ మృతదేహాన్ని తరలించారు. దీంతో స్ధానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement