Sunday, May 5, 2024

సీమాంధ్ర స‌మాజం ఓ అద్భుత గ్రంథం.. ప‌వ‌న్ క‌ల్యాణ్

అమరావతి : సీమాంధ్ర ప్రాంత రాజకీయాలను విశ్లేషించేందు కు లోతైన అధ్యయనం చేయాలనుకున్న 19వ శతాబ్ది లో సీమాంధ్ర సమాజం వల స పాలనలో రాజకీయ వికాసం గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది ఒక అద్భుతమైన రచనగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కొంపల్లి సుందర్‌ రచించిన 19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, ఆంగ్ల వలస పాలకుల వల్ల సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన అన్యాయాలు, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అణచివేత ప్రస్తుతం ఎదుర్కొర్టున్న పరిస్థితులపై ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లుగా వివరించారని కితాబిచ్చారు. ఇది ఒక పరిశోధన గ్రంథమని, గతంలో ఆంగ్లంలో రచించిన ఈ పుస్తకాన్ని మూడేళ్లు కష్టించి పనిచేసి తెలుగు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని, ఇది పూర్తిగా తెలుగులో లభించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. తెలుగు సమాజ అభివృద్ధి కోసం సర్వస్వాన్ని ధార పోసిన గొప్ప వ్యక్తి గాజుల లక్ష్మీనరసు శెట్టి స్వీయ చరిత్ర పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ అవిష్కరించారు. కాలగర్భంలో ఎందరో మహానుభావులు కలిసిపోయారని ప్రస్తుత తరాలు వారి గురించి తెలుసుకోలేని స్థితిలో ఉండటం బాధాకరమన్నారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన మొట్టమొదటి తెలుగు బిడ్డ లక్ష్మీ నరసు అని ఈయన దక్షిణ భారతదేశంలోనే ప్రప్రధమ ఉద్యమ కారుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం పుస్తకం రచయిత కొంపల్లి సుందర్‌, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement