Saturday, April 27, 2024

సినీ ,రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఓ సంచలనం

తెనాలి, ఫిబ్రవరి 19 ప్రభా న్యూస్ : సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఓ సంచలనం అంటూ కొనియాడరువక్తలు . మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా  ఎన్టీఆర్ వ్యక్తిత్వం, నటించిన సినిమాలు, ఆయన రాజకీయ జీవితంపై చర్చా కార్యక్రమంలో  ఆదివారం స్థానిక పెన్షనర్స్అసోసియేషన్ హాల్లో  నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రముఖ  రంగస్థల కళాకారులు  యడ్ల రవివర్మ ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. వెంపటి సత్యనారాయణ,  కొల్లూరు బసవయ్యలు ఎన్ఠీఆర్ సమసమాజ దృష్టి అనే అంశంపై ప్రసంగించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, మాదల కోటేశ్వరరావు, దేవరపల్లి భవాని, ఎన్టీఆర్  జగన్, ముప్పానేని రాఘవరావు, ఉమ్మలనేని ధర్మారావు, దేవిశెట్టి భాస్కర్, బడుగు మోహనరావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, హృదయరాజు, నల్లూరి శ్రీనివాస్, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement