Thursday, May 2, 2024

సున్నా వడ్డీ పథకాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ – ఎమ్మెల్యే శివకుమార్

తెనాలి – : కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా అక్కాచెల్లెమ్మళ్లకు అండగా నిలిచి వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొ న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్న మహిళా సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో వడ్డీలేని రుణాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు. అర్హులైన అక్క చెల్లెమ్మలకు స్వయం సహాయక సంఘాల రుణాల వడ్డీని వారి ఖాతాల్లోకి జమ చేశామన్నారు. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో రుణం చెల్లించిన అర్హులైన అన్ని సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు జమ చేయడం జరిగిందనన్నారు. నియోజకవర్గ పరిధిలో 4956 స్వయం సహాయక సంఘాలకుగాను కట్టవలసిన బాంక్ వడ్డీ రూ 4,37,3456 కోట్లను వారి ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు. పట్టణ పరిధిలో 1954 గ్రూపులు కు గాను రూ 2,20,54,616 కోట్లు మంజూరయ్యాయన్నారు. మండలం పరిధిలో 1698 గ్రూపులకు 1,30,40,602 కోట్లు,
కొల్లిపర మండలం లో 1304 గ్రూపులకు 86,8238 లక్షలు. మంజూరు చేసారని తెలిపారు. తొలి ఏడాదిలో 2019-2020 సంవత్సరానికి వడ్డీ మొత్తం 4 కోట్ల 36 లక్షలు, 2020- 2021 సంవత్సరానికి సంబంధించి వడ్డీ మొత్తం 4,37,3456 కోట్లు మంజూరు చేయగా రెండు సంవత్సరాలకు గాను 9 కోట్ల 16 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. సమావేశంలో కొల్లిపర డీఆర్డీవో వైయస్సార్ కాంతి పదం, ఏపీఎం కృపసాగర్, ఎమ్మార్వో నాంచారయ్య, తెనాలి మెప్మా ప్రభాకర్, వి.మాధవరావు, సిహెచ్ అరుణ, జడ్పీ సీఈఓ చైతన్య , మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మండల అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాస్ రావు, తెనాలి ఎంపిడిఓ విజయా లక్ష్మణ్, కొల్లిపర ఎంపీడీఓ శ్రీనివాస్, వైఎస్ఆర్సిపి సర్పంచులు, కౌన్సిలర్స్, వివిధ సంఘాల ద్వాక్రా మహిళలు పాల్గున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement