Friday, April 19, 2024

యాక్షన్ సీన్స్ చేస్తున్న తలైవా

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా నిర్మాతలను లాభాల్లో ఉంచగల స్టామినా రజినీకాంత్ కు ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ శివ డైరెక్షన్ లో అన్నాత్తె సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే ఇటీవల ఆరోగ్య సమస్యల నేపథ్యంలో గ్యాప్ తీసుకున్న రజినీకాంత్ ఇప్పుడిప్పుడే షూటింగ్ లో పాల్గొంటున్నారు. మొన్ననే హైదరాబాద్ కు వచ్చారు.

కాగా ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. భారీ వాహనాల మధ్య రజినీకాంత్ యాక్షన్ సీన్స్ చేస్తున్నట్లు సమాచారం. దిలీప్ మాస్టర్ డైరెక్షన్ లో ఈ ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక అన్నీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement