Saturday, May 4, 2024

ఆర్యవైశ్యసంఘం ఆధ్యాత్మిక సామాజిక సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే శివకుమార్

తెనాలి, ఫిబ్రవరి 18 ప్రభా న్యూస్: . పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ప్రతినిదులు సయుక్తంగా మహాశివరాత్రి పర్వదిన వేళ,పర్వతవర్ధనీ సమేత శ్రీ రామేశ్వరాలయంలొ శనివారం ఏర్పాటచేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ ఆత్మీయ అతిధిగా పాల్గొని నిర్వాహకుల,ఆధ్యాత్మిక,సామజిక సేవానిరతి ప్రశంసనీయం అన్నారు.భక్తులకు ఎమ్మెల్యే శివకుమార్ అన్నప్రసాదాన్ని వడ్డించారు.తొలుత శ్రీ రామశ్వరస్వామి సన్నిధానంలో ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ వివి.రమణకుమారి, ఆర్యవైశ్యప్రముఖుల ఎమ్మెల్యే శివకుమార్ కు సాదర స్వాగతం పలికారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ ఆర్యవైశ్య సంఘం అద్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావుమాట్లాడుతు అన్నం పరబ్రహ్మ స్వరూపమని ,మానవ సంబంధాలతో ముడిపడిన సమాజంలొ వివాహ శుభకార్యాలకు బంధు మిత్రులకు భోజనాలు పెడతామని, అలాంటిది పరమేశ్వరుని కల్యాణ వేళ భక్తులకు అన్న ప్రసాదం సమకూర్చే భాగ్యం తమ సంఘానికి లభించడం ఏంతో ఆనంద దాయకమన్నారు.తాము చేపట్టే కార్యక్రమాలకు శాసన సభ్యులు శివకుమార్ భుజం తట్టి అందిస్తున్న ప్రోత్సాహం మరవలనిదన్నారు.అదే విధంగా ఆలయ ఇఓ రమణకుమారి అందించిన సహకారిని ధన్యవాదాలు తెలిపారు.ఉదయం పది గంటల నుండి మధ్యాన్నం రెండు గంటల వరకు ,వేలాది భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీచేయగా, ఆర్యవైశ్య అనుబంధ సంఘాలు మహిళా సంఘం, యువజన సంఘం,వాసవి సేవాదళ్, ఆధ్యాత్మిక -సేవా కమిటీ సభ్యులు సహకరించారు. ఈ కార్యక్రమంలో మద్దాలి శేషాచలం, కటారి హరీష్, బూరెల దుర్గ, కొల్లా గురునాథ గుప్తా ,ఆతుకూరి పూర్ణచంద్రరావు, మాలేపాటి హరిప్రసాద్ ,ఉప్పల వరదరాజులు, సుబ్రహ్మణ్యం, కొండవీటి లక్ష్మీ పద్మావతి, వంకదారు శివ సుధాకర్, మాలేపాటి వేణు, తదితర ఆర్యవైశ్య నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement