Friday, April 26, 2024

సంక్షేమం ముసుగులో అభివృద్ధిని మరిచిన ప్రభుత్వం : నాదెండ్ల మనోహర్

తెనాలి: వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ ఛార్జ్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ లకు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేశారన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలను కూడా రానివ్వకుండా చేసి జగన్ ప్రభుత్వం తీవ్ర అర్థిక సంక్షోభం సృష్టించిందని తెలిపారు.

గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. గతంలో మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండేదన్నారు. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడతామన్న ధైర్యం ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న చెక్ పవర్ తీసేసిందన్నారు. నిధులు దుర్వినియోగం చేస్తోందన్నారు. 15వ అర్థిక సంఘం నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు తీసుకుపోయిందని, ఈ పరిస్థితిని జనసేన పార్టీ ఖండిస్తోందన్నారు. భవిష్యత్తులో గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తెనాలి శాసనసభ్యుడిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడం స్పష్టంగా కనబడుతోందన్నారు. తమ పార్టీకి ఉపయోగపడేలా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని నాదెండ్ల విమర్శించారు.


జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పించారని మనోహర్ చెప్పారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గానికి చెందిన పెదమల్లు వెంకట నారాయణ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనకు రూ.28,815 బీమా మొత్తం చెక్కును నాదెండ్ల మనోహర్ అందచేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement