Saturday, May 4, 2024

కెఎల్ యులో క్లౌడు టెక్నాలజీపై బాలికలకు అవగాహనా సదస్సు

తాడేపల్లి,ఫిబ్రవరి21(ప్రభ న్యూస్) కెఎల్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్న బాలికలకు క్లౌడ్ టెక్నాలజీల గురించి అవగాహన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయంలోని ఆర్ అండ్ డి భవనంలో ఈ నెల 20,21 సోమ, మంగళవారాలలో రెండు రోజులపాటు నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ , ఇంజినీరింగ్ విభాగం సహకారంతో ఆమెజాన్ వెబ్ సర్వీసు ద్వారా స్కిల్ అభివృద్ది విభాగం ప్రారంభించిన శిక్షణా సదస్సుకు స్కిల్ అభివృద్ది డీన్ డాక్టర్ ఎ.శ్రీనాధ్ అధ్యక్షత వహించగా, అంతర్జాతీయ క్లౌడ్ సంస్థ ఎడబ్యుఎస్ ప్రతినిధి ఆచార్య రాజా చిలకపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విబాగాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పెంచుకున్నారు.


ఈ సందర్బంగా అంతర్జాతీయ క్లౌడ్ సంస్థ ఎడబ్యుఎస్ ప్రతినిధి ఆచార్య రాజా చిలకపాటి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న క్లౌడ్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా అధ్యాపకులకు, విద్యార్థులకు క్లౌడ్ నైపుణ్యం పెరుగుతుందన్నారు. నేటి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. గూగుల్, మైక్రోసాప్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు క్లౌడ్ నైపుణ్యం ఉన్నవారికే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధమైన కార్యక్రమాల ద్వారా పాఠ్యాంశాల పైన విద్యార్ధినుల జ్ఞానాన్ని ప్రభావితం చేయడమే కాకుండా వారి కెరీర్‌లో కూడా ఎంతగానో సహాయపడుతుందన్నారు. కెల్ విశ్విద్యాలయంలో స్కిల్ అభివృద్ది విబాగం, ఎడ్యూస్కిల్ తో అద్భుతమైన అనుబంధం కలిగి ఉన్న కారణం చేత వివిధ విబాగాలలో విద్యానంతరం విద్యార్ధులకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాల కల్పనలో సహయపడుతుందన్నారు

.
ఈ సదస్సు అనంతరం విద్యార్ధులకు , అద్యాపకులకు వివిధ స్థాయిలలో ఎడబ్యుఎస్ సర్టిఫికేషన్ పరీక్షలు నిర్వహించినట్లు ఈ సందర్బంగా స్కిల్ అభివృద్ది డీన్ డాక్టర్ ఎ.శ్రీనాధ్ తెలిపారు. ఈ సందర్బంగా 30 మందికి పైగా అధ్యాపకులు, విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులు వివిధ స్థాయిలలో ఎడబ్యుఎస్ గ్లోబల్ సర్టిఫికేట్ లు పొందడం విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారధివర్మ, ప్రో.చాన్సులర్ డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.జగదీష్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ టి.రామకృష్ణ, సైన్స్ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుబ్రమణ్యం డాక్టర్ టి. పవన్ కుమార్, డాక్టర్ రూత్ రమ్య, డాక్టర్ శ్యామ్, డా. పి.రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement