Thursday, April 25, 2024

కేసీఆర్‌ సౌత్‌ టూర్‌.. మార్చిలో దక్షిణాది రాష్ట్రాల పర్యటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకన్నా ముందే ఒక విడత దేశంలోని అన్ని రాష్ట్రాలను చుట్టి వచ్చేందుకు భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకన్నా రెండు మూడు నెలల ముందే ఆయా రాష్ట్రాల పర్యటనలను పూర్తి చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. రాష్ట్రాల్లో పర్యటించే సమయంలోనే ఆయా రాష్ట్రాలకు సంబందించిన భారాస కమిటీలను కూడా ప్రకటించాలన్న సంకల్పంతో కేసీఆర్‌ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నియామకల ప్రక్రియకు అయన ఇప్పటికే శ్రీకారం చుట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తన 69వ జన్మదినం సందర్భంగా శుక్రవారం వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, విశ్రాంత సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు సీఎం కేసీఆర్‌కు ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్బంగా అయన జాతీయ రాజకీయ పరిస్థితులు ప్రధాని మోడీ పాలన, తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌,రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న వైనంతో పాటు భారాస బలోపేతం, విస్తరణ రాష్ట్రాల పర్యటనల అంశాలను వారితో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ వ్యాప్తంగా భారాసకు ఊహించని స్పందన వస్తోందని ప్రతి రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులు ఆయా రంగాలకు చెందిన వారు ఫోన్లు చేసి చెబుతున్నారని, దేశంలో మరో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటు కావలసిన అవసరం,ఆవశ్యకత ఎంతయినా ఉందని ఆ శక్తి భారాసకే ఉందన్న విషయాన్ని పేర్కొన్నారని, తన నాయకత్వంలోనే మార్పు రావాలని కోరుకుంటున్నారని కేసీఆర్‌ కొందరు పార్టీ అగ్రనేతలతో మాట్లాడుతూ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

- Advertisement -

తొలుత దక్షిణాదిన!

ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారాస రెండో బ#హరంగ సభ నిర్వ#హంచగా తదుపరి సభను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటుకు కసరత్తు చేస్తునట్టు సమాచారం. ఈ సభ నిర్వ#హణకు సంబంధించి భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తోపాటు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు లేదా ప్రకాశం జిల్లాల్లో సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోనూ సభలను నిర్వ#హంచాలని కూడా ప్రతిపాదించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం, బ#హరంగ సభ ఒకే రోజున జరిగేలా కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్‌ ఏపీ నేతలను కోరినట్టు సమాచారం. మార్చి నెలలో సభ నిర్వ#హంచాలని ఆ తర్వాత రెండు వారాల వ్యవధి ఇచ్చి ఒడిశా అటు పిమ్మట కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిలలో వరుస సభలను ఏర్పాటు చేసే దిశగా కార్యక్రమాలను రూపొందించాలని కేసీఆర్‌ సూచించినట్టు చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాలలో సభలు పూర్తయ్యాక ఉత్తరాదిన దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లి, పంజాబ్‌ హర్యానా రాష్ట్రాలలో సభల నిర్వహిణకు తాము ఎప్పుడైనా సిద్ధమని ఆ రాష్ట్రాలకు చెందిన అఖిలేష్‌ యాదవ్‌, భగవత్‌ సింగ్‌ మాన్‌తో పాటు రైతు సంఘాల నేతలు చెప్పినట్టు సమాచారం. జార్ఖండ్‌లోనూ సభ నిర్వహణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్‌ సుముఖత వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలోనూ దశల వారీగా భారాస బహిరంగ సభల నిర్వహణకు సమాయత్తం కావాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఖమ్మం సభ తరహాలో రానున్న రెండు, మూడు మాసాల్లో తెలంగాణలో మరో నాలుగైదు బహరంగ సభలను జరపాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఈ సభల నిర్వహణ ద్వారా అసెంబ్లి ఎన్నికల శంఖారావాన్ని పూరించే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement