Saturday, April 27, 2024

గుంటూరులో ఘరానా మోసం – ఐటి అధికారులమంటూ రూ.50 ల‌క్ష‌ల దోపిడీ..

గుంటూరు,ప్రభన్యూస్‌బ్యూరో: ఐటీ- అధికారు ల పేరు చెప్పి గుంటూరు నగరంలో ఘరానా మో సానికి పాల్పడ్డారు. ఏ మాత్రం అనుమానం రాకుం డా ఐటీ అధికారుల్లా సూట్లు, బూట్లు వేచుకుని ఖరీదై న కారులో వచ్చి అందినకాడికి దోచుకెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఓ ఆస్థి విక్రయంతో భారీగా నగదు వచ్చి నట్లు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న కేటుగాళ్ళు ఐటీ డ్రామాతో నగదు, బంగారం దోచుకెళ్ళినట్లు సమా చారం. సుమారు రూ.50లక్షల నగదు, 500 గ్రాము లు బంగారం చోరికి గురైందని బాధితులు చెబుతు న్నారు. ఇన్‌కమ్‌టాక్స్‌ అనే స్టిక్కరు ఉన్న కారుతో రావ డంతో నిజంగానే ఐటీ అధికారులని భావించారు. అయితే నగదు, బంగారు దోచుకున్న తర్వాత ఇంటికి అమర్చిన సీసీ పుటేజీలను ధ్వంసం చేశారు. ఇదంతా తెలిసినవారి పనేనని అనుమానిస్తున్నారు.

బాధితు లు, పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని పాత గు ంటూరు ప్రగతినగర్లో నివాసం ఉంటు-న్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో గురువారం ముగ్గురు వ్య క్తులు వచ్చారు. తాము ఐటీ- అధికారులమని చెప్పి ఇం ట్లోకి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను చెల్లించకుండా భారీగా బకాయి ఉన్నారంటూ ఆస్తిప త్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. గుర్తింపు కార్డులు చూపించాలని కల్యాణి నిలదీయ డంతో ఆమెను తుపాకీతో బెదిరించి డబ్బు, బంగారం తీసుకుని ఆస్తి పత్రాలు అక్కడే వదిలేసి ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. వెంటనే బాధితు రాలు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. సంఘటనా స్థలానికి క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ చేరుకుని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ అధికారుల పేరుతో వచ్చిన వాహనం నెంబరు, ఎటు వైపు నుంచి వచ్చారు తదితర వివరాలను స్థానికుల ను అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా క్రైం అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, తూర్పు డిఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్‌ఐ వెంక్ర టావులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక ఆస్థి విక్రయం చేయగా రూ.50లక్షల నగదు రావడంతో ఇంటిలోనే దాచినట్లు చెబుతున్నారు. ఆస్థి విక్రయ సమయంలో ఇదంతా గమనించి వ్యక్తులే ఈ వ్యవహారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement