Wednesday, May 8, 2024

బోల్తా ప‌డిన డీజిల్ ట్యాంక‌ర్.. బ‌కెట్ల‌తో ఎత్తుకుపోయిన స్థానికులు

రోడ్డు మ‌లుపు తిరిగే స‌మ‌యంలో ఓ డీజిల్ ట్యాంక‌ర్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది.దాంతో స్థానికులు ఇదే అదనుగా భావించి బకెట్లతో డీజిల్‌ను ఎత్తుకెళ్లిపోయారు. కొత్తగూడెం జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. డ్రైవర్ వారిస్తున్నా వినకుండా బకెట్లతో ట్యాంకర్‌లోని డీజిల్‌ను ఎత్తుకెళ్లిపోయారు స్థానికులు. తాము తస్కరించింది చాలక.. తెలిసి వాళ్లకూ సమాచారం ఇచ్చి డీజిల్ తీసుకెళ్లమని ప్రోత్సహించారు. దొరికినకాడికి డీజిల్ దోచుకుపోయారు. దీంతో.. బిత్తరపోవడం డ్రైవర్ వంతైంది. ప్రమాదం జరిగినప్పుడు సాయపడాల్సింది పోగా ఇలా దోచుకుపోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement