Friday, May 17, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్ర పూరితం

గుంటూరు అర్బన్, పోరాటాలు,32 మంది ఆత్మబలిదానాల ద్వారా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం దుర్మార్గం, కుట్రపూరిత చర్య అని.. తిరిగి పెద్ద ఎత్తున ప్రజాందోళనల ద్వారానే యధాస్థితిని కొనసాగిస్తూ లక్షలాదిమంది కార్మికుల జీవనాధారాన్ని కాపాడగల మని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ బి.శివ నాగేశ్వరరావు పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఆర్ పి ఐ (ఏ) ఆధ్వర్యంలో స్థానిక లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట, అనంతరం ఉక్కు సత్యాగ్రహి టీ.అమృతరావు విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున పికెటింగ్ చేశారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడి ఐదు దశాబ్దాలు అవుతున్నా సొంత ముడీ ఇనుము,గనులు కేటాయించకపోవడం దారుణమన్నారు.స్టీల్ ప్లాంట్ కు బయలు జిల్లా బయలుదిలా లోని ముడి ఇనుము కేటాయించే గలిగితే నష్టాల మాటే ఉండదని చెప్పారు.50 సంవత్సరాల క్రితం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల రూపాయల సొంత వనరులు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను బడా పారిశ్రామికవేత్తల పరం చేయటానికి పూనుకోవడం దుస్సాహసమే విమర్శించారు.ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తే ఆర్థిక సమస్యలు చక్కబడతాయి అని గ్యారెంటీ లేదని అందుకు విశాఖపట్నంలోని హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీ మూసివేతే ఉదాహరణ అని చెప్పారు. విశాఖపట్నంలో నెలరోజుల నుండి వేలాది మంది కార్మికులు ఆందోళన చేస్తున్న కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం ప్రభుత్వ దివాలాకోరు విధానాలకు అర్థం పడుతున్నదని విమర్శించారు.ముడి ఇనుమును తక్షణం సరఫరా చేయడం లేకుంటే కేంద్ర ప్రభుత్వ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లో విలీనం చేయడం ద్వారా కంపెనీ లాభాల బాటన పడుతుందని చెప్పారు. కార్యక్రమములో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చేబ్రోలు ప్రసాదరావు, మేక వెంకటేశ్వరరావు,రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం. జగదీష్,జిల్లా అధ్యక్షులు నక్క జయరాజ్,ఉపాధ్యక్షులు వి. ముత్తయ్య,తూర్పు,పశ్చిమ నియోజక వర్గాల ఇన్చార్జులు V.వెంకటేశ్వర రావు,మంచాల రాజు,నగర అధ్యక్షులు బెజవాడ సాంబయ్య,గుండాల శ్యాంబాబు,ముట్లూరు రాజు, డి శామ్యూల్,ఓ.రామి రెడ్డి, మల్లవరపు కృపారావు, దావల.విజయ్ రూపస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement