Saturday, May 18, 2024

15న నూతన విద్యా విధానం పై జాతీయ సదస్సు

గుంటూరు అర్బన్, స్థానిక అమరావతి రోడ్ లో ఉన్న హిందూ మేనేజ్మెంట్ కళాశాలలో భారతీయ శిక్షణ మండల్, నీతిఆయోగ్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సంయుక్త నిర్వహణలో ఈనెల 15న ఉదయం 9.30 నిమిషాలకు రోల్ ఆఫ్ టీచర్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే అంశంపై జాతీయ స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కార్యశాల సమన్వయకర్త,భారతీయ శిక్షణ మండలి ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. వి రమణ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన విద్యా విధానంపై సంపూర్ణ అవగాహన ఉన్న ఐఏఎస్ స్థాయి అధికారులు పలువురు తదితర రంగాల విద్యావ్యవస్థలో పైన విశ్లేషణాత్మక ప్రసంగాలు, పలు అంశాలపై చర్చలలో ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.ఈ సమావేశంలో కళాశాల పాలకమండలి ఉపాధ్యక్షులు ఎస్ వి ఎస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement