Tuesday, May 14, 2024

బ‌డుగుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డంతో జ‌గ‌న్ స‌రికొత్త చ‌రిత్ర – స‌జ్జ‌ల‌..

అమ‌రావ‌తి – బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో సరికొత్త చరిత్రను సృష్టించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మహిళా సాధికారతే లక్ష్యంగా పదవులు కేటాయించడం జరిగింది. 86 స్థానాలకు గానూ 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మేయర్, మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో కూర్చోబెట్టామన్నారు. 86 స్థానాల్లో 52 మంది మహిళలను మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లుగా ఎంపిక చేశామన్నారు. చట్టం చెప్పినదానికంటే మిన్నగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు ఇవ్వడంతో పాటు మహిళలకూ ప్రాధాన్యత కల్పించామని సగర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement