Tuesday, May 14, 2024

AP : గూడురు ఎమ్మెల్యే ఇంట్లో ఆగంత‌కుడి వీరంగం

గూడూరు, (ప్రభాన్యూస్):తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సొసైటీలోని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు ఇంటిపై బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు జొరబడ్డారు. ఇంటి ఆవరణంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. ఇంటి బయట ఉన్న నాలుగు ఫ్లెక్సీలను చింపివేశాడు. వరండాలో టేబుల్, ఫ్యాన్ పగులగొడుతున్న శబ్దం రావడంతో అక్కడ పనిచేసే మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో గుర్తు తెలియని దుండగుడు పరారయ్యాడు.

ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయంలో ఈ దాడి చోటుచేసుకోవడం పలు అనుమానాలకి దారితీస్తుంది.ఈ సంఘటనతో గూడూరు పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలు, అధికారులు ఉలిక్కిపాటుకు గురైయ్యారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీకి చెందిన వ్యక్తి ఈ వీరంగం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తనపై హత్యాయత్నం చేయాలని ప్రణాళిక సిద్ధం చేయడంతోనే ఈపని చేశానని పోలీసులకు ఆగంతకుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement