Friday, April 26, 2024

ఏఈ పోస్టుల భర్తీకి పరీక్షలు పూర్తి.. ప్ర‌క‌టించిన ఏపీ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్‌ సర్వీసుల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) నిర్వహించింది. ఈ నెల 14, 15 తేదీల్లో మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలోని 24 జిల్లాలతోపాటు తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ రాత పరీక్షల కోసం 158 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 14 తేదీ ఉదయం జరిగిన పేపర్‌- 3 పరీక్షకు మొత్తం 15 వేల 707 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 11 వేల 991 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

వారిలో 6 వేల 804 మంది(56.74 శాతం) పరీక్షకు హాజరయ్యారు. 15వ తేదీ ఉదయం పేపర్‌- 1 పరీక్షకు 44 వేల 175 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 32 వేల 827 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 22 వేల 101 మంది(67.32 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌- 2 పరీక్షకు 43 వేల 909 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. వారిలో 32 వేల 827 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 21 వేల 869 మంది(66.62 శాతం) హాజరైనట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement