Friday, April 26, 2024

సోము వీర్రాజు కౌంటర్ అదిరింది…

తిరుప‌తి – వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేటి ఉద‌యం బిజెపి పై చేసిన విమ‌ర్శ‌కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘మా ఊసు ఎందుకులే విజ‌య‌సాయి రెడ్డిగారు.. కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా.. లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా’’ అంటూ సోము ట్విట్ చేశారు.. ఇది ఇలా ఉంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు త‌గిన గౌర‌వం ఇవ్వాల‌ని మోడీ త‌మ‌కు చెప్పార‌ని సోము మీడియా సమావేశంలో చెప్పారు.. అలాగే బిజెపి – జ‌న‌సేన కూటమి అభ్య‌ర్థి ప‌వ‌న్ క‌ల్యాణే అంటూ స్ప‌ష్టం చేశారు.. దీనిపై
విజయసాయి స్పందిస్తూ, … ‘‘తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు’’ అని ట్విట్ చేశారు.. దీనికి సోము రివ‌ర్స్ కౌంట‌ర్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement