Saturday, April 27, 2024

రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర జరుగుతోంది- విశ్రాంత జడ్జి గుర్రప్ప

తిరుపతి రూరల్ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వివక్ష నిర్మూలన కై సూచించిన రిజర్వేషన్లను నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్చడానికి ప్రైవేటీకరణ అనే ఆయుధాలను వినియోగిస్తోందని విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప అన్నారు. సోమవారం తిరుపతి నగర పరిధిలోని యూత్ హాస్టల్ లో జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రామ్మూర్తి ఆధ్వర్యంలో సెమినార్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలా రాస్తోందని, దీనికి వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా రాజ్యాంగ పరిరక్షణకు, హక్కులను కాపాడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్వీయూ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మను వాదాన్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల వారి ఓట్లతో గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పూర్తిస్థాయిలో వ్యతిరేకించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ మునిరత్నం, నెమిలేటి కిట్టన్న, దినకర మూర్తి, కుప్పయ్య, గోవిందయ్య, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement