Wednesday, April 14, 2021

అమ‌ర‌జ‌వాన్ రౌతు కుటుంబాన్ని ఓదార్చిన జిల్లా ఎస్పీ…

విజ‌య‌న‌గ‌రం – ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిలో మృతి చెందిన రౌతు జగదీష్ కుటుంబాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి ప‌రామ‌ర్శించారు. పట్టణంలోని గాజులరేగలో వారింటికి వెళ్ళి, కుటుంబాన్ని ఓదార్చి, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబానికి జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్ర‌భుత్వ పరంగా ఆర్దిక సహాయాన్ని వారి కుటుంబ స‌భ్యుల‌కు అందించారు. ఎస్సీతో పాటు జిల్లా ఎస్పీ వెంట ఓఎస్దీ శ్రీ ఎన్. సూర్యచంద్ర రావు, విజయనగరం డిఎస్పీ శ్రీ పి. అనిల్ కుమార్, ఎఆర్ డిఎస్పీ శ్రీ ఎల్.శేషాద్రి, సిఐలు ఎన్. శ్రీనివాసరావు, సిహెచ్. శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News