Saturday, May 4, 2024

ప్రజల వద్దకే పాలన.. సీఎం జగన్ లక్ష్యం… ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : ప్రజల వద్దకే పాలన సీఎం జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గురువారం 14వ వార్డు, ఎస్.టి.వి.నగర్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై అన్నివర్గాల ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుందని చెప్పారు. అన్ని వర్గాల వారికి మేలు చేస్తున్న ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అన్ని చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమన్నారు. గడపగడపకు వెళ్ళిన సందర్భంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు కళ్ళల్లో ఆనందం అంతా ఇంతా కాదన్నారు.

అనంతరం డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల సమస్యల పరిష్కారమే గడపగడపకు మన ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిష్కరిస్తున్నామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ కాలువలు, రోడ్లు, సమస్యలు తమ దృష్టికి తీసిన వాటిని తక్షణమే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికీ 22 రోజులు పాటు చేపట్టడం జరిగిందన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. కరోనా సమయంలో కూడా తమను అన్ని విధాలుగా పెద్దకొడుకు లాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకోవడం జరిగిందని వివరించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, బ్యాంకు డైరెక్టర్ మబ్బు నాదముని రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారప రెడ్డి రాజారెడ్డి లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement