Monday, April 29, 2024

శ్రీవారి ఆర్జిత సేవ‌ల‌కు కోవిడ్ రిపోర్ట్…..

తిరుమల, ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి ప్రారంభించదలచిన శ్రీవైంకటేశ్వర స్వామివారి అర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో ముందుగా బుక్‌చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామని టీటీడీ ఈవో జహ వర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవ టికెట్లు బుక్‌ చేసుకునేవారు సేవకు 72 గంటల ముందు కోవిడ్‌ పరీక్షలు చేయించుకుని, ఆ సర్టిఫికెట్‌ తీసుకువస్తేనే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. కరోనా పూర్తి గా తగ్గాక విచక్షణ కోటా, ఆన్‌లైన్‌ లక్కీ డిప్‌ ద్వారా సేవా టికెట్లు మంజూరు చేస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో విలేకరు లతో మాట్లాడారు. ఇక మీదట ఏ ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోకూడదని ధర్మకర్తల మండలి నిర్ణ యించిందన్నారు. కల్యాణ మండపాల నిర్మాణానికి విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. టీటీడీ ఆలయాల వద్ద పంచగవ్యద్వారా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించి, తద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణ కోసం వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంచగవ్య ద్వారా అగర బత్తీలు, సబ్బులు లాంటి 15 ఉత్పత్తులు, ఆయు ర్వేద వైద్యానికి ఉపయోగించే 15 ఉత్పత్తులను త్వర లో తయారు చేస్తామని ఇందుకోసం ఆయుర్వేద ఫార్మ సిలో యం త్రాలను అప్‌గ్రేడ్‌ చేయనున్నామన్నారు. ఆన్‌లైన్‌లో అర్జిత సేవా టికెట్లు బుక్‌చేసుకునే వారు సేవకు 72 గంటల ముందు కోవిడ్‌ పరిక్ష చేయించుకుని నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకువస్తేనే అనుమతిస్తామ న్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అలిపిరి లో రెండు చోట్ల 2 వేల వాహనాలు, తిరు మలలో రెండు చోట్ల 1500 వాహనాలు పార్క్‌ చేసేలా మల్టి లెవెల్‌ పార్కింగ్‌ నిర్మించేందుకు ప్రణా ళికలు రూపొందిస్తున్నా మన్నా రు. టిటిడిలో కల్యాణ మండ పాల లీజు కాలాన్ని మూడు నుంచి ఐదు ఏళ్లకు, ఆ తరు వాత మరో రెండేళ్ళు పొడి గించేలా విధివిధానాలు తయా రు చేస్తున్నామని తెలిపారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకోసం గ్రీన్‌ ఎనర్జీ తయారుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక భవిష్యత్తులో విద్యుత్‌తో నడిచే వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతించేలా ఆలోచన చేస్తున్నామని, ఆర్టీసీ 150 విద్యుత్‌ బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు ప్రారం భించిందని, టీటీడీ అధికారులకు కూడా విద్యుత్‌తో నడిచే వాహనా లను కేటాయిస్తామని తెలిపారు. ఎన్‌టీ పీసీ ద్వారా ధర్మగిరిలో 25 ఎకరాల్లో 5 మెగావాట్ల సౌరవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామ న్నారు.
ఫిబ్రవరిలో నమోదైన వివరాలు..
శ్రీవారిని దర్శించు కున్న భక్తుల సంఖ్య 14.41 లక్ష, హుండీ కా నుకలు రూ||90.45 కోట్లు, తిరు మల శ్రీవారి ఇ-హుండీ కానుకలు రూ.3.51 కో ట్లు, తిరు చానూరు శ్రీప ద్మావతి అమ్మవారి ఇ-హుండీ కానుకలు రూ|| 12 లక్షలు, విక్ర యించిన శ్రీవారి లడ్డూ సంఖ్య 76.61 లక్షలు, అన్నప్రసాదం స్వీక రించి న భక్తుల సంఖ్య 21.07 లక్షలు, తలనీలాలు సమ ర్పించిన భక్తుల సంఖ్య 6.72 లక్షలు,
ఈ విలేకరుల సమావేశంలో టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజనీర్‌ రమేష్‌రెడ్డి, ఎస్విబిసి సిఈవో జి.సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement