Sunday, May 19, 2024

నేటి నుంచి అన్నమయ్య 615వ జయంతి ఉత్సవాలు

తిరుపతి: తాళ్లపాక అన్నమాచార్యులవారి 615వ జయంతి ఉత్సవాలు నేటి నుంచి 12వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా నేడు తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద శ్రీవారి కల్యాణం నిర్వ‌హిస్తారు.

తాళ్లపాకలో..
నేటి నుంచి 8వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

తిరుపతిలో..
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నేడు సప్తగిరి గోష్టిగానం, సాయంత్రం 6 గంటలకు సంగీత సభ జరగనుంది. మే 7 నుండి 12వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సు, సాయంత్రం 6 గంటల నుండి ప్ర‌ముఖ విద్వాంసుల గాత్ర‌, వాద్య‌, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement