Sunday, May 5, 2024

తిరుమ‌ల‌లో ఇంధ‌న పొదుపు…

అమరావతి, : లక్షలాది మంది భక్తులు వచ్చిపోయే తిరుమల తిరు పతి దేవస్థానం పరిథిలో విద్యుత్‌ విని యో గం అపరిమితం. అందుకోసం పెద్దఎ త్తున నిధులు వ్యయం అవుతున్నాయి. విద్యు త్‌ను పొదుపుగా వాడుకోవడంతో పాటు ఇం ధన పరిరక్షణ, పర్యావరణహిత విధానా లను అమలు చేయాలని టీటీడీ సూత్రప్రా యంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఏటా దాదాపు 68 మిలియన్‌ యూనిట్ల విద్యు త్తును వినియోగిస్తుండగా ఇందుకు చాలా మేరకు తగ్గించుకునేందుకు కార్యాచ రణ సిద్ధంచేస్తోంది. ఇంతటి భారీ స్థాయిలో విద్యుత్తును వినియోగించే టీ-టీ-డీ ఇంధన పొదుపుపై దృష్టి సారించింది. దీనివల్ల పర్యా వరణానికి మేలుతో పాటు- టీ-టీ-డీకి కరెంటు- బిల్లులు కూడా భారీగా తగ్గనున్నాయి. ఇంధన సామర్థ్యం కార్యక్రమాల అమలు, అత్యాధు నిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా కర్బన ఉద్యాగాలను కూడా తగ్గిం చుకోవాలని, ఇంధన పొదుపు లక్ష్యాన్ని చేరు కోవాలని భావిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభు త్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషి యన్సీ (బీఈఈ) సైతం సాంకేతిక, ఆర్థిక సాయం అందించటా నికి అంగీకారం తెలిపింది.
ఇంధన పొదుపు ఇలా…
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) నిర్వహించిన ప్రాథమిక ఇంధన ఆడిట్‌లో టీ-టీ-డీలో ఇంధనపొదుపు నకు అపార అవకాశాలు ఉన్నట్లు- తేలింది. ప్రస్తుతం ఉన్న సీలింగ్‌ ఫ్యాన్లు, ఎయిర్‌ కం డిషన్ల స్థానంలో 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన ఫ్యాన్లు, ఏసీలను అమర్చితే 8.68 మిలి యన్‌ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయ వచ్చు. దీంతో పాటు- నీటి సరఫరా, నిర్వ హణ, ఇతర అంశాల్లోనూ 25 శాతం ఇం ధనాన్ని పొదుపు చేయవచ్చని గుర్తిం చారు. ఏపీఎస్‌ఈసీఎం తాజాగా టీ-టీ-డీలో సర్వే చేయడంతో పాటు-, ప్రాథమిక ఇంధన ఆడిట్‌ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. త్వరలోనే సమగ్ర ఆడిట్‌ నివేదికను సిద్ధం చేయనుంది.ఉత్తమ ప్రమాణాలతో వాటర్‌ మేనేజిమెంట్‌, ఇంధన సామర్యం అమలు గురించి తిరు మల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డితో టీ-టీ-డీ ఈవో కెఎస్‌ జవహర్‌ రెడ్డి ఇప్పటికే చర్చించారు.
అన్ని దేవాలయాల్లోనూ ..
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు.. శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి, కాణిపా కం, ద్వారకా తిరుమల, సింహాచ లం, అన్న వరంలోనూ ఇంధన సామర్థ్య కా ర్యక్రమా లను అమలు చేయాలని ఏపీ ఎస్‌ఈసీఎం, ఇంధన శాఖ యోచిస్తున్నాయి . దేవాదాయ శాఖతో కలిసి ఈ కార్యక్రమా లను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

ఆద‌ర్శంగా టిటిడి – ఈవో జ‌వ‌మ‌హ‌ర్ రెడ్డి

పర్యావరణహిత ఇంధన సామర్థ్య కార్య క్రమాలను ఎంచుకోవడ మంటే సుస్థిరమైన భవిష్య త్తును ఎంచుకున్నట్లేనని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌ రెడ్డి చెప్పారు. అత్యుత్తమ ఇంధన సామ ర్థ్య కార్యక్రమాలను అమలు చేయ డం వల్ల టీ-టీడీకి ఇంధనంతో పాటు- ఆర్థికంగానూ లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రకృతితో కలిసి ప్రయాణించినట్లవుతుందని తెలిపారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో టీ-టీ-డీ ఇతరులకు రోల్‌ మోడల్‌గా నిలవనుందని జవహర్‌ రెడ్డి తెలిపారు.టీ-టీ-డీలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు సహకరిస్తున్న బీఈఈ డీజీ అభయ్‌ భాక్రే, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లికి ధన్యవాదాలు తెలియజేశారు. టీ-టీ-డీలో ఏటా 68 మిలియన్‌ యూనిట్ల విద్యు త్తు వినియోగంలో 36 శాతం సౌర, పవన విద్యుత్తే ఉంటుం దన్నారు. మిగిలిన 64 శాతం సాధారణ విద్యుత్‌ వాడకం ఉటుందని తెలిపారు. అంటే 435 లక్షల యూనిట్లు- అవసర మవుతోందని, తిరుపతి, తిరుమల కొండలు, సమీప ప్రాంతాలకు ఈ విద్యుత్తును ఏపీఎస్పీడీసీఎల్‌ సరఫరా చేస్తోందని తెలిపారు. ఏపీఎస్‌ఈసీఎం ఇంధన ఆడిట్‌, సమగ్ర ప్రాజెక్టును రూపొందిస్తోందని, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ఏపీఎస్‌ఈసీఎం చేస్తున్న సిఫారసులను టీ-టీ-డీ భవనాల్లో అమలు చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement