Friday, May 10, 2024

హైదరాబాద్‌లో ఎండవేడి.. కారులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. కాగా ఎండవేడి కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై వారు విచారణ చేపట్టారు. కాగా కారులో మంటలు చెలరేగడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మార్గంలో కాసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement