Thursday, April 25, 2024

స్కూల్‌ టీచర్‌ని పెళ్లాడిన బిలియనీర్‌..

ప్రపంచ మహిళా ధనవంతుల్లో ఒకరైన అమెజాన్‌ షేర్‌ హోల్డర్‌ మెకాంజీ స్కాట్ రెండో వివాహం చేసుకున్నారు. సీటెల్‌కు చెందిన డాన్‌ జెవెట్‌ అనే వ్యక్తి ని ఆమె పెళ్లాడారు. కాగా జెవెట్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇక మెకాంజీ స్కాట్‌, ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెకాంజీ రెండో వివాహంపై స్పందించిన ఆయన.. ‘‘డాన్‌ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. వాళ్లిద్దరు తీసుకున్న నిర్ణయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. బెజోస్‌- మెకాంజీ 2019లో భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామని సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బెజోస్‌.. ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్‌ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్‌ అమెజాన్‌ షేర్లను జెఫ్‌ బెజోస్,‌ మెకాంజీ పేరిట బదలాయించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రపంచంలోని సంపన్న మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement