Sunday, April 28, 2024

కరోనా సోకిన వేద పాఠశాల విద్యార్థులకు అండగా ఉంటాం – మంత్రి ఆళ్ల నాని

తిరుమల – ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా సోకిన విద్యార్థులకు అండగా ఉంటామని మంత్రి ఆళ్లనాని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా డీఎఎంహెచ్‌వోతో నాని ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో చదువుతున్న 57మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది. లాక్‌డౌన్‌ అనంతరం 5 రోజుల ముందు 435 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని తెలిపింది. వీరందరూ తమ స్వస్థలాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకుని పాఠశాలకు నెగటివ్‌ రిపోర్టులు సమర్పించారని వివరించింది. విద్యార్థులందరికీ మంగళవారం మరోసారి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా 57మంది విద్యార్థులకు పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement