Thursday, March 28, 2024

శివ గోపాల్ వర్మగా మారిన ఆర్జీవి….ఇదెక్కడి ఎడిటింగ్ మామ

రామ్ గోపాల్ వర్మ… ఆ పేరు వింటే కొంతమందికి చిరాకు వస్తుంది. మరికొంత మందికి కోపం వస్తుంది. ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే లాక్ డౌన్ సమయంలో ఓటిటి వేదికగా సినిమాలను రిలీజ్ చేసి రచ్చ చేశాడు. ఇప్పుడు తాజాగా మహాశివరాత్రి సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో ఉన్నది మరెవరో కాదు. వర్మ నే.

అయితే శివుడి గెటప్ లో ఎడిటింగ్ చేసి ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. దానికి తోడు మనోడికి వెటకారం కాస్త ఎక్కువ కాబట్టి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా.. ఇతని పేరు శివ గోపాల్ వర్మ. తెలిస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చెప్పండి అంటూ ట్యాగ్ లైన్ తగిలించాడు. ఇక అది చూసిన నెటిజన్లు వర్మ పై పంచులు వేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడి ఎడిటింగ్ మామ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక వర్మ ఇలాంటివి చేయడంలో లో మొదటి నుంచి దిట్టన్న సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/CMSLC2jlgcs/?igshid=s96qkij0y69g
Advertisement

తాజా వార్తలు

Advertisement