Friday, June 9, 2023

జంగారెడ్డిగూడెంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. శనివారం మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించడంతో నాలుగు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది. అయితే ఈరోజు మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కలకలం రేపిన నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు బయల్దేరారు. ఆయనతో నేతలు ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement