Thursday, March 23, 2023

Maharashtra: దైవ‌ద‌ర్శ‌నం కోసం వెళ్తూ… రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి

దైవ ద‌ర్శనానికి వెళ్తూ… ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఏడుగురు మృతిచెందగా, మ‌రో 30మందికి పైగా గాయ‌ప‌డిన‌ విషాధ ఘ‌ట‌న మహారాష్ట్రలో జ‌రిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలోని డిండిలో ఈ ఘటన జరిగింది. పండరీపూర్ కు దైవదర్శనం కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తుల్జాపూర్ లోని కడంవాడి వాసులు పండరీపూర్ కు దైవదర్శనానికి ఒక ట్రాక్టర్ లో బయల్దేరారు. ట్రాక్టర్ లో దాదాపు నలభై మందికి పైగానే ఉన్నారు.అయితే షోలాపూర్ – పూణె హైవే పైన భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ ను ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. 30 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను షోలాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement