Saturday, April 27, 2024

సీఎం జగన్ తో భేటీ కానున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాసేపట్లో సీఎం జగన్ తో కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. సజ్జల, శ్రీకాంత్ రెడ్డి బాలినేనిని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తీసుకెళ్లనున్నారు. బాలినేనిని తన వద్దకు తీసుకురావాలని సజ్జలకు సీఎం ఆదేశించారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డిని సజ్జల మరోసారి కలిశారు. విజయవాడలోని బాలినేని నివాసానికి సజ్జలతో పాటు శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డిలు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement