Sunday, May 5, 2024

Vrial: ఇదెక్కడి విడ్డూరం అయ్యా.. వడ్లకు, గోధుమలకు తేడా తెలియని బీజేపీ!

తెలంగాణ ధాన్యం సేకరణ అంశంలో కేంద్ర, ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల తరహాలోనే కొనుగోలు చేయాలన్నది టీఆర్‌ఎస్ డిమాండ్. ఈవిషయంలోనే గత నెల రోజుల నుంచి కేంద్రంతో కేసీఆర్‌ సర్కారు ఢీ అంటే ఢీ అంటోంది.  తెలంగాణలో పండించిన వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్‌ ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు దిగారు. అయితే బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం కోసం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడుతున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలే ఇప్పుడు ఆ పార్టీ నేతల పరువు తీశాయి.

ఫ్లెక్సీలో వరికి బదులుగా గోధుమల ఫోటోలు పెట్టడంతో అసలుకే ఎసరువచ్చినట్లైంది. వరి ధాన్యానికి బదులుగా గోధుమలు ఫోటో పెట్టడంతో ఇక్కడ బీజేపీ నాయకుల చిత్తశుద్ధిని బయటపెట్టిందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా జాగో తెలంగాణ అంటూ వడ్లకు, గోధుమలకు తేడా తెలియని సన్నాసులు ఏకుతాం, పీకుతాం అంటూ చేస్తున్న నినాదాలు అన్నదాత హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ చేస్తున్న పోరాటాన్ని తప్పు దోవ పట్టించడానికే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రేణులు చేసిన పొరపాటును సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ నేతల్ని కడిగిపారేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement