Wednesday, May 8, 2024

ఏపీలో థియేటర్లు ఓపెన్.. తెలంగాణ సంగతేంటి?

సినీ ప్రేమికులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లాక్​డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు తెరుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. 50 శాతం సామర్ధ్యంతో సినిమా హాళ్లను నడిపించొచ్చని పేర్కొందిప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణలో థియేటర్ల తెరిచే అంశంపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

కరోనా ఉద్ధృతి, లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. గతేడాది లాక్ డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లు.. కొన్ని నెలల అనంతరం మళ్లీ తెరిచారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూత పడ్డాయి. దీంతో సినీ కార్మికలు, థియేటర్ సిబ్బంది ఉపాధి లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మళ్లీ జోరందుకుంటున్నాయి. ఇప్పుడు ఏపీలో థియేటర్లకు అనుమతి రావడం వల్ల దర్శకనిర్మాతలు విడుదల తేదీలపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినా, ఎప్పటి నుంచి ప్రదర్శనలు మొదలు పెట్టాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మొత్తం మీద చాలా రోజులు తర్వాత చిన్న, పెద్ద హీరోల సినిమాలు వెండి తెరపై సందడి చేయనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement