Tuesday, May 14, 2024

AP | ఏపీ-ఈసెట్‌ పరీక్ష వాయిదా.. జూన్ 20న ఉంటుంద‌న్న ఈ-సెట్ చైర్మ‌న్‌

అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీ ఈ సెట్ ప‌రీక్ష వాయిదా ప‌డింది. బీఈ, బీటె-క్‌, బీఫార్మశీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో జెఎన్‌టీయుకె ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపిఎస్సిహెచ్‌ఎస్‌ఈ) నేతృత్వంలో మే 5న ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉంది. ఏపీ ఈసెట్‌ – 2023 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షను జూన్‌ 20 న నిర్వహించనున్నట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌, జెఎన్‌టీయూకే ఉపకులపతి ప్రొ.జి.వి.ఆర్‌.ప్రసాదరాజు తెలిపారు. అభ్యర్థులు ఈసెట్‌-2023 ప్రవేశ పరీక్షతేదీ మార్పును గమనించాలని కన్వీనర్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement