Wednesday, May 15, 2024

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎప్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌ సెట్‌- 2022 పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ వరకు పది సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలకు 2 లక్షల 6 వేల 579 మంది దరఖాస్తు చేసుకోగా.. లక్షా 94 వేల 752 మంది హాజరై పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్‌కు సంబంధించిన హాజరు శాతం 94.27 శాతంగా ఉంది.

అలాగే ఈ నెల 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో జరిగిన అగ్రికల్చర్‌, ఫార్మసీ సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 94 వేల 593 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 87 వేల 744 మంది హాజరై పరీక్షలు రాశారు. హాజరు శాతం 92.76 శాతంగా నమోదైంది. మొత్తంగా 3 లక్షల ఒక వెయ్యి 172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 82 వేల 496 మంది హాజరైనట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం హాజరు శాతం 93.8 శాతం నమోదైనట్లు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement