Friday, April 26, 2024

మహిళను కాపాడిన పోలీసులు.. అభినందించిన ఎస్పీ..

అనంతపురం : శిoగనమల చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన రాచేపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మిని శిoగనమల పోలీసులు కాపాడారు. భర్తతో గొడవపడి శింగనమల చెరువులో దూకేందుకు యత్నించగా… అదే సమయంలో హైవేలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది బాషా, ఇక్బాల్, గిరి మహేష్, సుంకన్నలు ఈమెను ర‌క్షించారు. కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శింగనమల ఎస్సై శ్రీనివాసులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement